69వ అతి విశిష్ట్ రైల్ సేవా పురస్కారాల ప్రధానం..! 5 h ago

featured-image

రైల్వే శాఖలో విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు దేశ వ్యాప్తంగా 101 మంది అధికారులకు కేంద్ర రైల్వే శాఖ అతి విశిష్ట్ రైల్ సేవా పురస్కారాలు ప్రదానం చేసింది. వీరిలో ఆరుగురు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉన్నారు.

దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఆరుగురు అధికారులు..

ఆంతోనీ దొరై రాజ్ (చీఫ్ కమర్షియల్ ఇన్స్‌పెక్ట‌ర్‌), జవ్వాడి వెంకట అనూష (సీనియర్ డివిజనల్ ఇంజినీర్), వావిలపల్లి రాంబాబు (సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్), సుమిత్ శర్మ (డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్), పి ఆదినారాయణ (సీనియర్ సెక్షన్ ఇంజినీర్), కామరపు వినోద్ (సీనియర్ సెక్షన్ ఇంజినీర్).

ఎవరికి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు...

భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం ఈ అవార్డులను వ్యక్తిగత కేటగిరీ, ఉత్తమ పనితీరు కనబరిచిన రైల్వే జోన్ల కేటగిరీలో ప్రధానం చేస్తుంది. 2025 నాటికి అన్ని రైళ్లను 100% విద్యుదీకరించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కవచ్ భద్రతా వ్యవస్థ..తరచుగా సంభవించే రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ అధునాతన సాంకేతికత వ్యవస్థ ఉపయోగించబడుతుంది. సూపర్ యాప్..రైల్వే ప్రయాణీకుల సౌలభ్యం కోసం, రైల్వే సేవలన్నింటినీ ఒకే ప్లాట్ఫారమ్ కింద డిజిటలైజ్ చేసేందుకు ఈ యాప్ ని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD